కిడ్నాప్ చేసి దారుణంగా చంపబోతే... ముగ్గులోకి దించి బయటపడిన అథ్లెట్ నటాలీ!

29-07-2019 Mon 08:52 | International
  • నటాలీ బిర్లీని బలవంతంగా తీసుకెళ్లిన కిడ్నాపర్
  • నగ్నంగా కట్టేసి హింసలు
  • ప్లాన్ వేసి తప్పించుకున్న యువతి
తనను కిడ్నాప్ చేసి, దారుణంగా హింసించడంతో పాటు, నగ్నంగా కట్టేసి, చంపేందుకు ప్రయత్నించిన కీచకుడి బారి నుంచి క్షేమంగా బయటపడిందో ఆస్ట్రేలియా అథ్లెట్. సినీ పక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, ఆస్ట్రియాకు చెందిన ట్రయాథ్లెట్ నటాలీ బిర్లీ, ఎప్పటిలానే సైకిల్ పై ప్రాక్టీస్ చేస్తుండగా, వెనుక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఆపై ఆమె తలపై మోదిన ఆగంతకుడు, ఆమెను ఎత్తి తన కారు వెనుక సీట్లో వుంచి, తీసుకెళ్లిపోయాడు.

కాసేపటి తరువాత నటాలీకి స్పృహ వచ్చి చూడగా, తాను నగ్నంగా ఓ కుర్చీలో కట్టివేయబడివున్నానని గమనించింది. ఎదురుగా భయంకరంగా కనిపిస్తున్న వ్యక్తి, చేతిలో కత్తి పట్టుకుని మద్యం తాగాలని బెదిరించాడు. నటాలీ తాగబోనని కరాఖండీగా చెప్పింది. దీంతో ఆగ్రహంతో ముక్కు మూసి ఆమెను చంపాలని చూశాడు. అది కుదరకపోవడంతో నీళ్లు నిండిన బాత్ టబ్ లో ముంచి చంపాలని చూశాడు. ఇక తాను బతకడం అసాధ్యమేనన్న ఆందోళన నిండిన ఆమె, ఆ ఇంట్లో చాలా ఆర్చిడ్ పూల మొక్కలున్నాయని గుర్తించి, ప్లాన్ వేసింది.

తనకు ఆ పూలంటే చాలా ఇష్టమని అతనితో చెప్పింది. మెల్లిగా మాట్లాడుతూ, ముగ్గులోకి దించింది. దీంతో ఆ కసాయి కూడా కబుర్లలో పడ్డాడు. తానెందుకు ఉన్మాదిగా మారిందీ చెప్పాడు. తండ్రి చనిపోయాడని, తల్లి మద్యానికి బానిసైందని, ప్రియురాలు మోసం చేయడంతో లోకంపై కసిని పెంచుకున్నానని చెప్పాడు. అతన్ని పూర్తిగా కబుర్లలోకి దించిన ఆమె, తనను చంపవద్దని వేడుకుంటూనే, రోడ్డుపై వెళుతుంటే ప్రమాదవశాత్తూ దెబ్బలు తగిలాయని చెబుతానని నమ్మబలికింది.

కొన్ని గంటలుగా ఆమెతో మాట్లాడుతున్న కిడ్నాపర్, ఆమె మత్తులో పడిపోయి, క్షేమంగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపేసి వెళ్లిపోయాడు. ఆ వెంటనే తానిచ్చిన హామీని పక్కనబెట్టిన నటాలీ, మరో అమ్మాయికి తనకు పట్టిన గతే పట్టరాదన్న ఉద్దేశంతో పోలీసులకు పూర్తి సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే పోలీసులు ఆ కిడ్నాపర్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.
Natali BirleyAustriaNudeKidnapPlan

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more