పరిటాల రవి హత్య తర్వాత ఎక్కడ, ఎన్ని బస్సులు తగలబెట్టాలో చంద్రబాటు టార్గెట్లు పెట్టారు!: విజయసాయిరెడ్డి
- విధ్వంస, హింసా రాజకీయాలకు బాబే ఆద్యుడు
- బాబు ఎంత నీచానికైనా దిగజారుతాడు
- ఘాటు విమర్శలు గుప్పించిన వైసీపీ నేత
ఈరోజు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో స్పందిస్తూ..‘హింస, విధ్వంస రాజకీయాలకు ఆద్యులు తమరు కాదా చంద్రబాబు గారూ. పరిటాల రవి ఫ్యాక్షన్ హత్య తర్వాత జిల్లాలకు ఫోన్లు చేసి ఎన్ని బస్సులు తగలబెట్టాలి. ఎవరెవరిపై దాడులు చేయాలో పార్టీ నాయకులకు టార్గెట్లు పెట్టిన చరిత్రను మర్చిపోయారా? రాజకీయ మనుగడ కోసం ఎంత నీచానికైనా దిగజారే స్వభావం మీది’ అని దుయ్యబట్టారు.