TTD: శ్రీవారికి భారీ విరాళం.. రూ.2.40 కోట్లు అందించిన అజ్ఞాత భక్తుడు!

  • టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేత
  • తన పేరును బయటపెట్టవద్దని కోరిన భక్తుడు
  • శ్రీవారి ఆలయానికి భారీగా ఆదాయం
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి ఓ భక్తుడు భారీ విరాళం అందించాడు. టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.2.40 కోట్ల విరాళం ఇచ్చాడు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని కలుసుకున్న సదరు భక్తుడు ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశాడు. అయితే తన పేరును మాత్రం బయటపెట్టవద్దని సదరు అజ్ఞాత భక్తుడు కోరాడు. ఇటీవల మరికొందరు భక్తులు కూడా భారీ విరాళాలు అందజేశారు.
TTD
Tirumala
YV SUBBAREDDY
YSRCP
2.40 CRORE
donation

More Telugu News