ఏపీ మంత్రుల ప్రవర్తన చాలా దారుణంగా ఉంది: చంద్రబాబు
- అసెంబ్లీ హుందాతనం పూర్తిగా దెబ్బతినేలా ఉంది
- సభలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు
- మాపై బురదజల్లుతున్నారు
టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులపై జరుగుతున్న దాడులపై చర్చకు రావాలని కోరినా పట్టించుకోవడం లేదని, సమావేశాలు ప్రారంభమై పదకొండు రోజులు అవుతున్నా స్పందించడం లేదని విమర్శించారు. సభలో ఏ అంశం చర్చకు వచ్చినా తమకు అవకాశం ఇవ్వడం లేదని, వైసీపీ సభ్యులు తమపై నోరుపారేసుకున్న సందర్భాల్లో సరైన సమాధానం చెప్పాలని, కౌంటర్ ఇవ్వాలని చూస్తున్నప్పటికీ, తమకు అవకాశం ఇవ్వకపోగా, బురదజల్లుతున్నారని మండిపడ్డారు.