సునీల్ అలా మారిపోవడం నాకు బాధ కలిగించింది: హీరో ఆకాశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సునీల్ అలా మారిపోవడం నాకు బాధ కలిగించింది: హీరో ఆకాశ్

  • సునీల్ బతిమాలితే ఆ మూవీ చేశాను
  •  ఒక్క పోస్టర్లోను నేను లేను 
  • నా గురించి ఆయన ఒక్క ముక్కా చెప్పలేదన్న ఆకాశ్
'ఆనందం' సినిమా చూసినవాళ్లు హీరో ఆకాశ్ చాలా బాగున్నాడ్రా అనుకున్నారు. అమ్మాయిలు ఆయనపై మనసు పారేసుకున్నారు. తెలుగులో ఆయన బిజీ హీరో అవుతారని చాలామందే అనుకున్నారు. కానీ ఆయన ఊహించనిస్థాయిలో వెనుకబడిపోయాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ సునీల్ గురించి ప్రస్తావించాడు.

'అందాల రాముడు' సినిమా కోసం సునీల్ బతిమాలితే ఆ సినిమాలో రెండో హీరోగా చేశాను. అందుకోసం నేను ఒక తమిళ సినిమాను కూడా వదులుకున్నాను. కానీ 'అందాల రాముడు' పోస్టర్లో నా స్టిల్ ఒక్కటి కూడా కనిపించనీయలేదు. ఆ సినిమా హిట్ అయిన తరువాత సునీల్ ఏ స్టేజ్ పైనా గురించి ఒక్కమాట కూడా చెప్పలేదు. అంతకుముందు 'భయ్యా .. భయ్యా' అనేవాడు, ఆ తరువాత నుంచి 'ఏయ్ ఆకాశ్' అని పిలవడం మొదలుపెట్టాడు. ఆయనలా మారిపోవడం నాకు చాలా బాధ కలిగించింది" అని చెప్పుకొచ్చాడు. 
Akash
Sunil

More Telugu News