ఏపీ ప్రభుత్వ వైఖరి వల్లే రుణం విషయంలో ప్రపంచబ్యాంకు వెనక్కి వెళ్లిపోయింది!: కన్నా లక్ష్మీనారాయణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నదానికి, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతనే లేదని ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వం అన్నాక కులాలు, మతాలకు అతీతంగా పాలన అందించాలని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొన్నారు.

కాకినాడలో ఈరోజు జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా స్పందించకపోవడంతోనే రుణం విషయంలో ప్రపంచబ్యాంకు వెనక్కు తగ్గిందని కన్నా ఆరోపించారు. ఏపీ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను ఐదేళ్లలోనే పూర్తిచేశామని స్పష్టం చేశారు.
Go Back to Shorts
Andhra Pradesh
BJP
Kanna lakshmi narayana
Jagan
Chief Minister
loan
world bank

More Telugu News