యాంకర్ శ్వేతారెడ్డి ఆరోపణల కేసు.. 'బిగ్ బాస్' నిందితులకు ముందస్తు బెయిల్!
- శ్వేతారెడ్డి ఫిర్యాదుతో నలుగురిపై కేసు
- నిన్న ముందస్తు బెయిల్ ఇచ్చిన నాంపల్లి కోర్టు
- స్టార్ మా చానల్ అడ్మిన్ హెడ్ కు నోటీసులు
ఈ నెల 13న శ్వేతారెడ్డి ఫిర్యాదు ఇవ్వగా, శ్యామ్, రవికాంత్, రఘు, శశికాంత్ లపై పోలీసులు కేసులు పెట్టారు. నాటి నుంచి పోలీసుల విచారణకు హాజరుకాని వారు, బుధవారం నాడు నాంపల్లి కోర్టుకు హాజరై, ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లను దాఖలు చేశారు. తమపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, పోలీసుల విచారణకు సహకరిస్తామని చెప్పారు. దీంతో వారికి ముందస్తు బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఈ కేసులో స్టార్ మా చానెల్ అడ్మిన్ హెడ్ కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.