మోదీ, ట్రంప్ సమావేశంలో కశ్మీర్ పై చర్చ జరగలేదు: రాజ్ నాథ్ సింగ్
- కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి భారత్ ఒప్పుకోదు
- దేశ ఆత్మాభిమానం విషయంలో రాజీపడే పసక్తే లేదు
- మోదీ, ట్రంప్ భేటీ అయిన సమయంలో జైశంకర్ అక్కడే ఉన్నారు
మోదీ నుంచి ట్రంప్ కు మధ్యవర్తిత్వం వహించాలన్న ప్రతిపాదన ఏదీ వెళ్లలేదని విదేశాంగ మంత్రి జైశంకర్ నిన్న లోక్ సభలో తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజ్ నాథ్ మాట్లాడుతూ, జైశంకర్ చెప్పిన మాట నిజమేనని అన్నారు. మోదీ, ట్రంప్ భేటీ అయిన సమయంలో జైశంకర్ అక్కడే ఉన్నారని చెప్పారు. ఈ అంశానికి సంబంధించి ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.