సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రష్మిక డబ్బింగుకు 60 రోజులు! 
  • డ్యాన్స్ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమా 
  • నాగ్ చిత్రానికి భారీ రేటు 
*  'డియర్ కామ్రేడ్' సినిమాలో నా పాత్రకి నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను..' అంటోంది కథానాయిక రష్మిక. 'నా పాత్రకి వేరొకరు చెబితే సరిగ్గా అతకదేమో అనిపించి, దర్శకుడ్ని అడిగాను. ఆయన ఓకే అనడంతో చెప్పాను. మీరు నమ్ముతారో లేదో కానీ, డబ్బింగ్ పూర్తిచేయడానికి 60 రోజులు పట్టింది.. నాకు తెలుగు రాదు కదా, అందుకే అంత టైం తీసుకున్నాను' అని చెప్పింది రష్మిక.  
*  ఆమధ్య 'కేజీఎఫ్' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నాడని, దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్టు, ఇది డ్యాన్స్ ఆధారిత కథతో రూపొందుతుందని తాజా సమాచారం.
*  నాగార్జున హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'మన్మథుడు 2' చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ మంచి రేంజ్ లో జరుగుతోంది. తాజాగా హిందీ డబ్బింగ్ హక్కులు సుమారు 6 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. రకుల్ నాయికగా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 9న విడుదల చేస్తున్నారు.
Rashmika
NTR
KGF
Nagarjuna
Rakul

More Telugu News