Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైపర్ ఆదితో నాకు గొడవలేం లేవు : 'జబర్దస్త్' అదిరే అభి

  • హైపర్ ఆది నా టీమ్ లో ఉండేవాడు
  • ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది
  •  ఆ ప్రచారంలో నిజం లేదన్న అదిరే అభి  
'జబర్ దస్త్' కామెడీ షో ద్వారా అదిరే అభి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ స్టేజ్ పై ఒక టీమ్ లీడర్ గా ఆయన చాలా కాలంగా కొనసాగుతున్నాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "హైపర్ ఆది నా టీమ్ లో చేసేవాడు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం వుంది. నా టీమ్ లో చేసే హైపర్ ఆది మరో కొత్త టీమ్ కి లీడర్ అయ్యాడు. దాంతో మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయనీ, అందుకే హైపర్ ఆది బయటికి వెళ్లిపోయాడనే ప్రచారం జరిగింది.

కానీ నిజానికి మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. మరో కొత్త టీమ్ ను ఏర్పాటు చేద్దామని 'జబర్దస్త్' టీమ్ భావించింది. వున్న టీమ్స్ లో సెకండ్ పొజీషన్ లో వున్న వాళ్లందరినీ కలిపి ఒక టీమ్ ను తయారు చేశారు. అలా హైపర్ ఆది .. రైజింగ్ రాజు ..అంతా కలిసి ఒక టీమ్ గా ఏర్పడ్డారు. హైపర్ ఆది టీమ్ లీడర్ అయినందుకు సంతోషపడిన వాళ్లలో నేను మొదటివాడిని" అని చెప్పుకొచ్చాడు.
Adire Abhi

More Telugu News