Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎంతో కష్టపడి పైకొచ్చాను: సంగీత దర్శకుడు కోటి

  • చిన్నప్పటి నుంచి అంతా నన్ను 'కోటి' అనే పిలిచేవారు 
  • 'కోటి' గానే పాప్యులర్ అయ్యాను 
  • నా అంకితభావమే నన్ను పైకి తీసుకొచ్చింది  
సంగీత దర్శకుడిగా ఎన్నో వందల సినిమాలకి పని చేసిన కోటి, ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ను అందించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'కోటప్ప కొండ'లోని కోటేశ్వరస్వామి పేరును అమ్మానాన్నలు నాకు పెట్టారు. స్కూల్లో కూడా అంతా నన్ను 'కోటి' అనే పిలిచేవారు.

ఇండస్ట్రీకి వచ్చిన తరువాత కూడా అందరికీ 'కోటి'గానే పరిచయమయ్యాను. మధ్యలో కొంతమంది పూర్తి పేరు వేసుకోమని సూచించారు. నేను మాత్రం 'కోటి'నే బాగుందనుకుని అలాగే నా ప్రయాణాన్ని కొనసాగించాను. ఎక్కడా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా, సంగీతం పరంగా ఎవరూ వేలెత్తి చూపకూడదనే ఉద్దేశంతో ఎంతో కష్టపడ్డాను. అహర్నిశలు పడిన కష్టానికి ఫలితం దక్కింది .. అభిమానుల హృదయాల్లో నా కంటూ ఒక మంచి స్థానం దక్కింది" అని చెప్పుకొచ్చారు.
Koti

More Telugu News