చంద్రయాన్ 2: నింగిలోకి దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ
- నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన జీఎస్ఎల్వీ
- ప్రపంచ అంతరిక్ష రంగంలో సత్తా చాటిన ఇస్రో
- ఆనందంలో మునిగితేలుతున్న యావత్ భారతదేశం
ఈ ప్రయోగం ద్వారా జీఎస్ఎల్వీ ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ లను తనతో పాటు తీసుకెళ్లింది. రాకెట్ బరువు 640 టన్నులు. 3,877 కిలోల బరువు కలిగిన చంద్రయాన్- కాంపోజిట్ మాడ్యూల్ తో రాకెట్ పయనిస్తోంది. భూమికి 181 కిలోమీటర్ల ఎత్తులో చంద్రయాన్-2 మాడ్యూల్ విడిపోతుంది.
ఈ ప్రయోగానికి రూ. 978 కోట్లు ఖర్చయింది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగాన్ని యావత్ ప్రపంచం ఆసక్తికరంగా పరిశీలిస్తోంది.