యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లగానే... ఆమె పేరిట వీడియో విడుదల!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లగానే... ఆమె పేరిట వీడియో విడుదల!

  • బిగ్ బాస్ లోకి 13వ కంటెస్టెంట్ గా శ్రీముఖి
  • ఫ్యాన్స్ కు ప్రత్యేక వీడియో విడుదల
  • ఎంటర్ టెయిన్ చేస్తానని ప్రామిస్ చేసిన శ్రీముఖి
నిన్నటి నుంచి ప్రారంభమైన టాలీవుడ్ బిగ్ బాస్ మూడో సీజన్ లో కంటెస్టెంట్ గా ప్రముఖ యాంకర్ శ్రీముఖి కూడా ఉందన్న విషయం తెలిసిందే. తనను పరిచయం చేస్తున్న సమయంలోనే డ్యాన్సులతో అదరగొట్టిన ఆమె, ఆపై హౌస్ లోకి ఎంటర్ అయింది. ఇక, ఆమె హౌస్ లోకి ఎంటర్ కాగానే, ఆమె పేరిట ట్విట్టర్ లో ఓ వీడియో విడుదలైంది.

 తాను హౌస్ లోకి వెళ్లనున్నట్టు ముందే ఫ్యాన్స్ కు చెప్పాలని భావించానని, అయితే, బిగ్‌బాస్‌ నిబంధనల వల్ల ఈ విషయాన్ని చెప్పలేకపోయానని వెల్లడించింది. బిగ్ బాస్ లోకి వెళుతున్నారా? అని తనను ఎంతో మంది అడిగారని, కానీ కండిషన్స్ కారణంగానే ఆ విషయాన్ని చెప్పలేదని వెల్లడించిన శ్రీముఖి, ఈ వీడియో ప్లే అయ్యే సమయానికి ప్రారంభ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిపోయి ఉంటుందని కూడా పేర్కొంది. ప్రామిస్ గా తాను బోలెండంత ఎంటర్ టెయిన్ చేస్తానని, తనకు మద్దతు ఇవ్వాలని ప్రేక్షకులను కోరింది. కాగా, ఈ సీజన్ లో మొత్తం 15 మంది హౌస్ లోకి వెళ్లగా, 13వ కంటెస్టెంట్ గా శ్రీముఖి పేరును హోస్ట్ నాగార్జున ప్రకటించారు.
Srimukhi
Biggboss
Contestent
Video

More Telugu News