ఉద్యోగార్థులకు స్పైస్‌జెట్‌ యాజమాన్యం ముందే పరీక్ష

  • విమానం నాలుగు గంటల ఆలస్యం
  • ఆందోళన చెందిన ఆర్‌బీఐ పరీక్షార్థులు
  • పట్టించుకోని యాజమాన్యం
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు పరీక్షకు హాజరు కావాల్సి ఉన్న ఉద్యోగార్థులకు స్పైస్‌జెట్‌ విమానయాన సంస్థ ఈరోజు ముందస్తు పరీక్ష పెట్టింది. విశాఖలో పరీక్ష రాయాల్సిన అభ్యర్థులు విమాన ప్రయాణాన్ని నమ్ముకుంటే వారి ఆశలపై యాజమాన్యం నీళ్లు చల్లింది. ఉదయం 7.45 గంటలకు బయుదేరాల్సిన  విశాఖ విమానం నాలుగు గంటలు ఆలస్యమైనా బయలుదేరక పోవడంతో పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు పూర్తిగా ఆశలు వదులుకున్నారు.

మరోవైపు వివిధ పనులపై బయుదేరిన ప్రయాణికులు కూడా తమ షెడ్యూల్‌ తప్పినందుకు ఆందోళన వ్యక్తం చేశారు. అటు ఉద్యోగార్థులు, ఇటు ఇతర ప్రయాణికులు ఎవరు ఎంతగా ఆందోళన చెందినా యాజమాన్యం మాత్రం కించిత్తు కూడా స్పందించక పోవడం విశేషం.
Go Back to Shorts
spicejet
RRB
too Late

More Telugu News