ఆగస్టులో తిరుమల వెంకన్నకు రెండు సార్లు గరుడ సేవ!

  • పున్నమి వేళ స్వామికి గరుడ సేవ
  • 5న గరుడ పంచమి సందర్భంగా మరోసారి
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
వచ్చే నెలలో తిరుమల శ్రీ వెంకటేశ్వరునికి రెండు సార్లు గరుడసేవలు జరగనున్నాయి. మామూలుగా అయితే, ప్రతి నెలా ఓ మారు, పున్నమి వేళ, స్వామివారిని గరుడ వాహనంపై తిరు మాఢ వీధుల్లో ఊరేగిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టులో 15వ తేదీన పౌర్ణమి రానుండగా, 5వ తేదీన గరుడ పంచమి పర్వదినం ఉంది. దీంతో 5న కూడా గరుడ వాహనంపై స్వామి ఊరేగనున్నారు. రెండు సార్లు గరుడ వాహనంపై స్వామి ఊరేగడం అరుదుగా వస్తుందని భక్తులు అంటున్నారు. ఈ రోజుల్లో భక్తులు అధికంగా వచ్చే అవకాశాలు ఉన్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు.
Go Back to Shorts
Tirumala
Tirupati
ttd
Garuda Seva

More Telugu News