హీరో అవ్వాలని వచ్చి చిన్నపిల్లల కిడ్నాపర్ అయ్యాడు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరో అవ్వాలని వచ్చి చిన్నపిల్లల కిడ్నాపర్ అయ్యాడు!

  • తమిళనాడులో ఘటన
  • గాళ్ ఫ్రెండ్ తో కలిసి చిన్నారి అపహరణ
  • పోలీసులకు దొరికిపోయిన వైనం
రంగుల ప్రపంచంలో తాను భాగం అవ్వాలని వచ్చిన ఓ యువకుడు చివరికి పెడదారి పట్టాడు. విలాసాల కోసం గాళ్ ఫ్రెండ్ తో కలిసి కిడ్నాప్ లకు తెరలేపాడు. తమిళనాడులో కలీముల్లా అనే యువకుడు సినిమా హీరో అవ్వాలని భావించి చెన్నై వచ్చాడు. ఎన్నో ప్రయత్నాలు చేసినా హీరో చాన్స్ రాలేదు కానీ, సైడ్ రోల్స్ లభించాయి. వాటిలో ఏదీ పెద్దగా గుర్తింపునివ్వలేదు. ఈలోపు విలాసాలకు అలవాటుపడ్డాడు. డబ్బు సరిపోకపోవడంతో ఏంచేయాలో తోచక వారం రోజుల పాటు క్రైమ్ సినిమాలు చూడడంతో కిడ్నాప్ ఐడియా తట్టింది.

సినిమాలు చూసిన పరిజ్ఞానంతో ఓ చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ చేశాడు. గాళ్ ఫ్రెండ్ కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. చెన్నై షినాయ్ నగర్ కు చెందిన మూడేళ్ల పాపతో తన నేర చరిత్రకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ పాపను కిడ్నాప్ అయితే చేయగలిగాడు కానీ, సీసీటీవీ ఫుటేజ్ లు, పోలీసులు ఉంటారని గుర్తించలేకపోయాడు.

కిడ్నాప్ చేసిన తర్వాత పాప తల్లిదండ్రుల నుంచి రూ.60 లక్షలు డిమాండ్ చేశాడు. ఈ విషయాన్ని పాప తల్లిదండ్రులు పోలీసులకు తెలుపడంతో వారు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగి కలీముల్లాను, అతడి గాళ్ ఫ్రెండ్ ను అదుపులోకి తీసుకున్నారు. పాపను సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.
Tamilnadu
Kolywood
Chennai

More Telugu News