ఉజ్జయినీ మహంకాళి బోనాలు.. రేపు ఉదయం నుంచి హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
- రేపు ఉదయం 4 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు
- వాహనదారులు సహకరించాలని కోరిన సీపీ
- సోమవారం రాత్రి పది గంటల వరకు అమల్లోకి
సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపునకు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆల్ఫాహోటల్ నుంచి, గాంధీ క్రాస్‌రోడ్స్, సజ్జన్‌లాల్ స్ట్రీట్, ఘాస్మండి, బైబిల్‌హౌస్ మీదుగా కర్బలామైదాన్ వైపునకు వెళ్లాలి. సోమవారం మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10గంటల వరకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి సెయింట్‌మేరీస్ రోడ్లో వాహనాలకు అనుమతి లేదు. హకీంపేట, బోయినపల్లి, బాలానగర్, అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్లే బస్సులను క్లాక్‌టవర్ వద్దే నిలిపివేస్తారు. తిరిగి అక్కడి నుంచే బస్సులు బయలుదేరుతాయి. ప్రయాణికులు, వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని సీపీ అంజనీ కుమార్ కోరారు.