ప్రపంచ బ్యాంకే వెనక్కిపోతే ఇక ఇతర పెద్ద బ్యాంకులూ ముందుకురావు: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచ బ్యాంకే వెనక్కిపోతే ఇక ఇతర పెద్ద బ్యాంకులూ ముందుకురావు: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల

  • ఏపీకి నిధులివ్వనని వరల్డ్ బ్యాంకు వెనుకడుగు వేసింది
  • ఆంధ్రప్రదేశ్ ఆర్థికలోటుతో ఉన్న రాష్ట్రం
  • మన బడ్జెట్ ఈగలమోతలా ఉంది
ఏపీకి ప్రపంచ బ్యాంకు నిధులిచ్చేందుకు వెనుకడుగు వేసిందని, దీని ప్రభావంతో ఇతర పెద్ద బ్యాంకులు కూడా ముందుకురావని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు. అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ ఆర్థికలోటుతో ఉన్న రాష్ట్రమని, రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం లేదని అన్నారు. ఏపీ బడ్జెట్ ఈగలమోతలా ఉందని, రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం, జలవనరుల ప్రాజెక్టులు ఆగిపోతాయని, కేవలం, ‘నవరత్నాలు’ పేరుతో దోపిడీ మాత్రం జరగుతుందని వ్యాఖ్యనించారు.
Andhra Pradesh
cm
jagan
Telugudesam
Gorantla

More Telugu News