బ్యాంకుల సొమ్ముతో సోకు చేసేవాడితోనే దేశానికి నష్టం.. పీవీపీకి కేశినేని ఘాటు కౌంటర్!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ), టీడీపీ నేత కేశినేని నానిల మధ్య ట్విట్టర్ సాక్షిగా యుద్ధం కొనసాగుతోంది. తాతల సొమ్ముతో సోకులు చేసే వేలిముద్రగాడిని తాను కాదని పీవీపీ వ్యాఖ్యానించడంపై కేశినేని నాని తీవ్రంగా స్పందించారు.

ఈరోజు ట్విట్టర్ లో కేశినేని స్పందిస్తూ..‘తాత డబ్బుతో సోకు చేసే వాళ్ళతో దేశానికి నష్టం లేదు. బ్యాంకుల డబ్బుతో సోకు చేసే వాళ్ళతోనే దేశానికి నష్టం. నిస్సానిల వల్ల దేశానికి వచ్చిన ప్రమాదం లేదు. దుష్ట మేధావుల వల్ల మాత్రం దేశానికి పెను ప్రమాదం. లాగు రంగు వల్ల సమాజానికి ఇబ్బంది లేదు. మనసు, మది మలినం కాకుండా వుంటే సమాజానికి మంచిది’ అని చురకలు అంటించారు.
Go Back to Shorts
Andhra Pradesh
pvp
Kesineni Nani
YSRCP
Telugudesam
Twitter

More Telugu News