ఏపీలో మావోయిస్టుల పంజా.. ఇద్దరు గిరిజనుల కిడ్నాప్, హత్య!
- మరో గిరిజనుడిని చితకబాదిన మావోలు
- విశాఖపట్నం జిల్లా వీరవరంలో ఘటన
- మావోల కోసం గాలింపు ప్రారంభించిన పోలీసులు
వారు బయటకు రాగానే బలవంతంగా తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా సత్తిబాబు, భాస్కరరావులు పోలీస్ ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్నారని మావోయిస్టులు ఆరోపించారు. తాము ఇన్ఫార్మర్లం కాదని ఇద్దరు గిరిజనులు మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఇద్దరిినీ అక్కడికక్కడే తుపాకీతో కాల్చి చంపారు. అనంతరం మరో గిరిజనుడు లింగరాజును తీవ్రంగా కొట్టి వదిలేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఏజెన్సీ ప్రాంతంలో గాలింపును ముమ్మరం చేశారు.