ఈ నెల 21 లేదా 22 తేదీల్లో చంద్రయాన్-2 ప్రయోగానికి యోచన!
- జూలై 15న జరగాల్సిన ప్రయోగం
- క్రయోజనిక్ దశలో లీకేజ్ కారణంగా వాయిదా
- లోపాన్ని గుర్తించి సరిచేస్తున్న ఇస్రో సాంకేతిక నిపుణులు
చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ క్రయోజనిక్ దశలో లీకేజి ఉన్నట్టు తెలుసుకున్నారు. దీన్ని సరిచేసేందుకు ఇస్రో ఇంజినీర్ల బృందం అహర్నిశలు కృషి చేస్తోంది.
అన్నీ అనుకూలిస్తే ఈ నెల 21న గానీ, 22వ తేదీన గానీ చంద్రయాన్-2 ప్రయోగం నిర్వహించాలని ఇస్రో వర్గాలు భావిస్తున్నాయి. మొదట లాంచ్ కు అనువైన సమయంగా జూలై 22వ తేదీగా నిర్ణయించినా, అంతకుముందు రోజు కూడా ప్రయోగానికి అనుకూలంగానే ఉండడంతో ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజు ప్రయోగం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.