ప్రపంచకప్ విజేతను తేల్చేందుకు అలా చేసి ఉంటే బాగుండేది: సచిన్
- రెండో సూపర్ ఓవర్ వేయించి ఉండాల్సింది
- అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేది
- అన్ని టోర్నమెంట్లలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలి
తాజాగా, ఈ వివాదంపై దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ పెదవి విప్పాడు. సూపర్ ఓవర్ కూడా టైగా ముగిసినప్పుడు మరో సూపర్ ఓవర్ నిర్వహించి ఉంటే సమస్య పరిష్కారమయ్యేదని, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేదని అభిప్రాయపడ్డాడు. బౌండరీ నిబంధన కంటే ఇది మిన్నగా ఉండేదని అన్నాడు. అయితే, ఇది ఒక్క ప్రపంచకప్‌కు మాత్రమే పరిమితం కాదని, అన్ని టోర్నమెంట్లలోనూ ఇదే పద్ధతిని అమలు చేయాలని ఐసీసీని కోరాడు.