వీసా గడువు ముగిసినా హైదరాబాదులో ఉంటున్న విదేశీయుల ఇళ్లలో తనిఖీలు
- స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం
- 23 శాతం మంది అక్రమంగా నివసిస్తున్నారు
- సూడాన్, సోమాలియా దేశస్తులే ఎక్కువగా ఉన్నారన్న సీపీ
ఈ నేపథ్యంలో 21 బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, వీసా గడువు ముగిసినా నివసిస్తున్న విదేశీయుల్లో సూడాన్, సోమాలియా దేశస్తులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. మెహిదీపట్నం, టోలీ చౌక్, చాంద్రాయణగుట్ట, అంబర్ పేట, ఉస్మానియా యూనివర్శిటీ, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో డెబ్బై ఐదు శాతం తనిఖీలు నిర్వహించామని అన్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉండే విదేశీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.