జగన్ గారూ! ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు: నారా లోకేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ గారూ! ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు: నారా లోకేశ్

  • జగన్ కు వాయిదాలకు వెళ్లే అలవాటు ఉంది
  • అందుకే, ఆయన పరిపాలనలోనూ అన్నీ వాయిదాలే
  • జగన్ అనాలోచిత నిర్ణయంతో విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడమే కాకుండా సూచనలు కూడా చేశారు. ఏపీలోని ఇంజనీరింగ్ కళాశాలల అడ్మిషన్లలో జాప్యం జరగడంపై విమర్శలు చేశారు. ఓ పత్రికలో వెలువడ్డ కథనాన్ని తన పోస్టుకు జత చేసిన లోకేశ్, జగన్ పై సెటైర్లు విసిరారు. జగన్ కు వాయిదాలకు వెళ్లే అలవాటు ఉంది కనుకనే, ఆయన పరిపాలనలో కూడా అన్నీ వాయిదాలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, ఆయన అనాలోచిత నిర్ణయంతో, ఏపీ విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల విషయమై ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని జగన్ కు సూచించారు. 
YSRCP
Jagan
cm
Telugudesam
nara lokesh

More Telugu News