గగనతలాన్ని తెరిచిన పాకిస్థాన్.. పౌర విమానాలకు అనుమతి
- బాలాకోట్ దాడుల తర్వాత గగనతలాన్ని మూసివేసిన పాక్
- ఏప్రిల్‌లో ఒకే ఒక్క మార్గాన్ని తెరిచిన పాక్
- వాణిజ్య విమానాలకు మాత్రం అనుమతి నిరాకరణ
పుల్వామా దాడికి ప్రతీకారంగా నియంత్రణ రేఖకు ఆవల బాలాకోట్‌లో ఉన్న జైషే ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై ఫిబ్రవరి 26న భారత వాయుసేన దాడులు చేసింది. ఈ దాడి తర్వాత పాక్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసింది. ఆ తర్వాత ఏప్రిల్‌లో మూసివేసిన 11 వాయుమార్గాల్లో ఒక దానిని తెరిచింది. మార్చిలో పాక్షికంగా వాయుమార్గాలను తెరిచినప్పటికీ భారత విమానాలను అనుమతించలేదు. తాజాగా, అన్ని మార్గాలను తెరిచినట్టు ప్రకటించింది.