ఫిక్సింగ్ వ్యవహారంపై స్పందించిన 'దాదా'
ఐపీఎల్ ను కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందించారు. రాజస్థాన్ రాయల్స్ పేసర్ శ్రీశాంత్ ఓ మూర్ఖుడు అని గంగూలీ పేర్కొన్నాడు. ఫిక్సింగ్ కు పాల్పడి చాలా తెలివి తక్కువ పని చేశాడని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ బెంగాల్ టైగర్ నేడు సీఎన్ఎన్-ఐబీఎన్ తో మాట్లాడుతూ, ఐపీఎల్ లో అవినీతి విషయం తెలియగానే ఎంతో ఆగ్రహానికి గురయ్యానని చెప్పాడు. ఫిక్సింగ్ కుంభకోణంలో దొరికిపోయిన ఈ ముగ్గురు క్రికెటర్లు దోషులని తేలితే, వారిపై జీవితకాల నిషేధం విధించాలని గంగూలీ అన్నాడు.
తమ హయాంలో, సచిన్, లక్ష్మణ్, ద్రావిడ్, కుంబ్లే, జహీర్ ఖాన్, హర్భజన్, సెహ్వాగ్ వైపు ఎవరూ వేలెత్తి చూపలేదని గర్వంగా చెప్పాడు. ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన విషయమని, తప్పుచేయాలంటూ ఎవరూ మనల్ని బలవంతం చేయలేరని అన్నాడు. ఇక రాజస్థాన్ రాయల్స్ సారథి రాహుల్ ద్రావిడ్ పై గంగూలీ సానుభూతి వ్యక్తం చేశాడు. ఐపీఎల్-6లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న సమయంలో ఆ జట్టుకు చెందిన ముగ్గురు క్రికెటర్లు ఫిక్సింగ్ ఆరోపణలతో దూరం కావడం విచారకరమని వ్యాఖ్యానించాడు.