ఇంగ్లాండ్ ప్రపంచకప్ ఫైనల్ ను స్కాట్ ల్యాండ్, ఫ్రాన్స్, వేల్స్ తో ఆడబోతోందట.. బ్రిటీషర్ల వింత జవాబులు!
- ఇంగ్లాండ్ లో ‘ఈఎస్ పీఎన్’ సంస్థ సర్వే
- ఫైనలిస్టుల పేర్లను అడిగిన యాంకర్
- చిత్రవిచిత్రమైన జవాబులు చెప్పిన బ్రిటీషర్లు
దీనికి ప్రజలు ఇచ్చిన సమాధానం విన్న యాంకర్ కు దిమ్మతిరిగింది. ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాతో, భారత్ తో ఫైనల్ ఆడబోతోందని కొందరు చెప్పారు. మరికొందరు బ్రిటీషర్లు అయితే ఇంగ్లాండ్, వేల్స్ మధ్య ఇంగ్లాండ్-స్కాట్ ల్యాండ్ మధ్య మ్యాచ్ జరగబోతోందని సెలవిచ్చారు. అక్కడితో ఆగకుండా ఫ్రాన్స్ ను కూడా ఈ జాబితాలో చేర్చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కడంటే ఒక్కరే ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య మ్యాచ్ జరుగుతుందని చెప్పడం గమనార్హం. ఈ వీడియోను మీరూ చూసేయండి.