20 రూపాయల దొంగతనం కేసులో 41 ఏళ్ల తర్వాత రాజీ!
- నిన్న పరిష్కారం చూపిన గ్వాలియర్ న్యాయమూర్తి
- ఇకపై ఇటువంటి తప్పిదాలు చేయవద్దని నిందితుడికి సూచన
- 1978లో బస్సులో జరిగిన సంఘటన
దీంతో పోలీసులు కేసు నమోదుచేసి ఇస్మయిల్ఖాన్ను అరెస్టు చేశారు. కొన్ని నెలలు జైల్లో ఉన్న తర్వాత అతను బెయిల్పై విడుదలయ్యాడు. కేసు విచారణ సందర్భంగా పలుమార్లు కోర్టుకు హాజరయ్యాడు. అయితే 2004 తర్వాత అతను కోర్టుకు హాజరు కావడం మానేశాడు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో కోర్టు అతని అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఖాన్ను పట్టుకుని జైలుకు పంపడంతో మూడు నెలలుగా అక్కడే ఉన్నాడు.
ఖాన్ నిరుపేద కావడంతో బెయిల్ ఇప్పించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో కోర్టు ఇద్దరినీ పిలిపించి లోక్అదాలత్లో విచారణ నిర్వహించింది. అనంతరం ఇకపై ఇటువంటి నేరాలు చేయవద్దంటూ ఖాన్ నుంచి లిఖిత పూర్వక హామీ తీసుకుని విడుదల చేసింది.