సింహగిరి ప్రదక్షిణకు భారీ ఏర్పాట్లు : సింహాచలంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
- ఏటా ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రతిష్ఠాత్మక ఉత్సవం
- 32 కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన చుట్టేయనున్న భక్తులు
- ఈ ఏడాది 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా
ఈ ఉత్సవంలో తెలుగు రాష్ట్రాల వాసులు, ఒడిశా, చత్తీస్గడ్, పశ్చిమబెంగాల్‌తోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో స్థిరపడిన విశాఖవాసులు హాజరవుతారు. ఈ ఏడాది ఈ ఉత్సవంలో దాదాపు 10 లక్షల మంది పాల్గొంటారని అంచనా. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానం అధికారులు పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.
దారి పొడవునా తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్యశిబిరాలు, మంచినీరు ఏర్పాటు చేస్తున్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు భక్తులకు ఆహారం, టీ, స్నాక్స్ అందించేందుకు సిద్ధమవుతున్నాయి.