పశ్చిమ గోదావరి జిల్లాలో మరిన్ని చమురు నిక్షేపాలు... త్వరలోనే ఉత్పత్తి!
- తాజాగా నాలుగు బావులు గుర్తింపు
- మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభం
- రోజుకు 1,400 టన్నుల ఆయిల్ వెలికితీత లక్ష్యం
వాస్తవానికి నరసాపురం చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 30 సంవత్సరాలుగా చమురును వెలికితీస్తున్న బావులు ఖాళీ కావడంతో, పాలకొల్లు, యలమంచిలి, భీమవరం తదితర ప్రాంతాల్లో రెండేళ్ల నుంచి గ్యాస్ అన్వేషణ కొనసాగుతోంది. తాజాగా, మొగల్తూరు మండలం ఆకెనవారితోట, భీమవరం సమీపంలోని మహాదేవపట్నం సహా నాలుగు చోట్ల చమురు నిక్షేపాలను అధికారులు గుర్తించారు.