జగన్ పాలన అధ్వానంగా ఉండబోతోందన్న విషయం బడ్జెట్ తో స్పష్టమైంది: చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జగన్ పాలన అధ్వానంగా ఉండబోతోందన్న విషయం బడ్జెట్ తో స్పష్టమైంది: చంద్రబాబు

  • ట్విట్టర్ వేదికగా చంద్రబాబు విమర్శల వర్షం
  • జగన్ గారు చిటికెల పందిరి వేశారంటూ సెటైర్
  • డ్వాక్రా హామీలను బడ్జెట్ లో ఎందుకు విస్మరించారంటూ నిలదీత
ఏపీ సర్కారు ప్రకటించిన వార్షిక బడ్జెట్ పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ గారు నోటికొచ్చినట్టు హామీలు గుప్పించి చిటికెల పందిరి నిర్మించారంటూ ఎద్దేవా చేశారు. ఆ చిటికెల పందిరిపై అభివృద్ధి, ప్రజాసంక్షేమాన్ని పాకించి పంట పండిస్తామంటున్నారని ట్వీట్ చేశారు. జగన్ పాలన ఎంత అధ్వానంగా ఉండబోతోందన్న విషయం బడ్జెట్ తో స్పష్టమైందని పేర్కొన్నారు.

ఏం కట్టాలని రాజధానికి రూ.500 కోట్లు, కడప స్టీల్ ప్లాంట్ కు రూ.250 కోట్లు కేటాయించారని వ్యంగ్యం ప్రదర్శించారు. అసలిది అయ్యే పనేనా? అంటూ చంద్రబాబు పెదవి విరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు సున్నా వడ్డీ రుణాలపై కూడా స్పందించారు. సున్నా వడ్డీ రుణాలకు మాత్రం రూ.1,788 కోట్లు కేటాయించారు కానీ, డ్వాక్రా మహిళలకు ఐదేళ్ల వ్యవధిలో రూ.75 వేలు ఇస్తామన్న హామీ, డ్వాక్రా రుణాల రద్దు హామీలను మాత్రం బడ్జెట్ లో విస్మరించారు, మరీ ఇంత మోసం అయితే ఎలా? అంటూ మండిపడ్డారు.  

"అప్పట్లో మేము 5 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయిస్తే, రాష్ట్రంలో కోటి 72 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, వాళ్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడా కోటి 72 లక్షల మంది నిరుద్యోగుల గురించి ఎలాంటి ప్రస్తావన మీ బడ్జెట్ లో కనిపించలేదు. ఆ నిరుద్యోగులకు ఏమిస్తున్నారో జగన్ గారే చెప్పాలి" అంటూ విమర్శల జడివాన కురిపించారు.
Chandrababu
Jagan
Andhra Pradesh
Telugudesam
YSRCP

More Telugu News