నా సినిమాను కొంతమంది ఆపాలని చూశారు: హీరో సందీప్ కిషన్
- ఎంతో కష్టపడి ఈ సినిమా చేశాము
- అందరికీ డబ్బులు ఇచ్చేశాము
- ఈ సారి హిట్ కొడతానన్న సందీప్ కిషన్
రోజుకి 150 మందికి భోజనాలు పెడుతూ, ఒక కుటుంబ వాతావరణంలో ఈ సినిమా షూటింగును పూర్తిచేశాము. ఎంతో నిజాయతీగా మేము ఈ సినిమాను తీస్తే, విడుదల ఆపడానికి కొంతమంది ప్రయత్నాలు చేయడం బాధాకరం. మా నిజాయితీయే ఈ సినిమాను విడుదల దిశగా నడిపించింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుంది .. నా కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకం వుంది" అని అన్నాడు