ఫిఫ్టీ పూర్తిచేసి కామెంటరీ బాక్స్ దిశగా బ్యాట్ ఊపిన జడేజా
- మంజ్రేకర్ ను ఉద్దేశించేనా?
- కొన్నిరోజుల క్రితం జడేజాపై మంజ్రేకర్ విమర్శలు
- కివీస్ తో సెమీస్ లో పోరాడుతున్న టీమిండియా
కొన్నిరోజుల క్రితం మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ 'అడపాదడపా ఆటగాడు' అంటూ జడేజా విషయంలో కామెంట్ చేశాడు. దీనిపై మంజ్రేకర్ కు భారీస్థాయిలో ట్రోలింగ్ ఎదురైంది. జడేజా కూడా "నీ నోటి విరేచనాలు ఇక కట్టిపెట్టు" అంటూ మంజ్రేకర్ ను ఉద్దేశించి ఘాటుగా బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో, జడేజా బ్యాట్ ఊపింది మంజ్రేకర్ ను ఉద్దేశించేనని అర్థమవుతోంది. 50 పరుగులు చేసిన వెంటనే "ఇప్పుడేమంటావు?" అనే రీతిలో జడేజా బాడీ లాంగ్వేజ్ కనిపించింది.