హెన్రీ నిప్పులు.... మరో వికెట్ కోల్పోయిన టీమిండియా
- దినేశ్ కార్తీక్ అవుట్
- 13 ఓవర్లలోత్ 4 వికెట్లకు 38 పరుగులు చేసిన భారత్
- ఛేజింగ్ లో టీమిండియాకు కష్టాలు
కివీస్ పేసర్ మాట్ హెన్రీ నిప్పులు చెరిగే బౌలింగ్ తో టీమిండియాకు అగ్నిపరీక్ష పెడుతున్నాడు. నిలదొక్కుకుంటున్న దశలో దినేశ్ కార్తీక్ (6) హెన్రీ విసిరిన ఆఫ్ సైడ్ బంతిని వెంటాడి అవుటయ్యాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 13 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 38 పరుగులు కాగా, క్రీజులో రిషబ్ పంత్ (19), హార్దిక్ పాండ్యా (5) ఆడుతున్నారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ 3, బౌల్ట్ ఓ వికెట్ తీసి భారత్ లైనప్ ను కకావికలం చేశారు.