నేటి న్యూజిలాండ్, భారత్ మ్యాచ్ కు ఉచిత ప్రవేశం: ఐసీసీ కీలక నిర్ణయం

  • టికెట్లను విక్రయించబోవడం లేదు
  • కెపాసిటీ మేరకు అభిమానులకు ప్రవేశం
  • స్పష్టం చేసిన ఐసీసీ
నిన్న మధ్యలో ఆగిపోయిన భారత్ - న్యూజిలాండ్ సెమీ ఫైనల్ మ్యాచ్ నేటి మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుండగా, ఐసీసీ కీలక ప్రకటన చేసింది. నేటి మ్యాచ్ కి సంబంధించిన టికెట్లను ఆన్ లైన్ లో, ఆఫ్ లైన్లో అమ్మడం లేదని స్పష్టం చేసింది. మ్యాచ్ చూసేందుకు ఉత్సాహంతో వచ్చే ప్రేక్షకులను ఉచితంగానే అనుమతిస్తామని తెలిపింది. స్టేడియం కెపాసిటీ మేరకు అభిమానులను లోనికి పంపుతామని పేర్కొంది. కాగా, మరోసారి వర్షం కారణంగా మ్యాచ్ జరిగే పరిస్థితి లేకుంటే, టికెట్లను కొన్నవారు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
Go Back to Shorts
ICC
India
New Zeland
Cricket
Semis

More Telugu News