బాలీవుడ్ కి తెలుగు సినిమా దమ్ము తెలిసింది: హీరో రానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలీవుడ్ కి తెలుగు సినిమా దమ్ము తెలిసింది: హీరో రానా

  • ఒకప్పుడు తెలుగు సినిమాపై చిన్నచూపు ఉండేది
  • తెలుగు కథలు తమ సత్తాను చాటుతున్నాయి
  • తెలుగు కథలవైపు బాలీవుడ్ హీరోల చూపు        
ప్రస్తుతం రానా తెలుగులో 'విరాటపర్వం' చేస్తున్నాడు. మరో వైపున తమిళ .. హిందీ సినిమాలు కూడా చేసేస్తున్నాడు. తాజాగా ఆయన బాలీవుడ్ లో 'కబీర్ సింగ్' జోరును గురించి ప్రస్తావించాడు. "ఇంతకుముందు దక్షిణాది సినిమాలంటే బాలీవుడ్ వారు చిన్నచూపు చూసేవారు .. ఎగతాళి చేసేవారు. కానీ రాన్రాను పరిస్థితులు మారుతూ వచ్చాయి.  

'బాహుబలి' నుంచి తెలుగు సినిమా దమ్ము పెరుగుతూ వెళుతోంది. తెలుగు కథలు తమ బలాన్ని చాటుకుంటున్నాయి. 'టెంపర్' రీమేక్ గా ఇటీవల హిందీలో రూపొందిన 'సింబా' .. 'అర్జున్ రెడ్డి' రీమేక్ గా రూపొందిన 'కబీర్ సింగ్' భారీ వసూళ్లను సాధిస్తూ ఉండటమే అందుకు నిదర్శనం. అమితాబ్ .. అక్షయ్ .. షారుక్ .. సల్మాన్ తెలుగు సినిమాలపై ఒక కన్నేసి ఉండటానికి కారణం, ఇక్కడి కథల్లో దమ్ము ఉండటమే" అని చెప్పుకొచ్చాడు.
Rana

More Telugu News