నాని డబ్బింగ్ తో 'ది లయన్ కింగ్' టీజర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాని డబ్బింగ్ తో 'ది లయన్ కింగ్' టీజర్

  • జంగిల్ యానిమేషన్ మూవీగా 'ది లయన్ కింగ్'
  • వివిధ భాషల్లో ఈ నెల 19న విడుదల 
  • చిన్నారుల్లో పెరుగుతోన్న ఆసక్తి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పిల్లలందరి దృష్టి జంగిల్ యానిమేషన్ మూవీ 'ది లయన్ కింగ్' పైనే వుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ సినిమాను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. ఆయా భాషలకి చెందిన ప్రముఖ హీరోలతో ఈ యానిమేషన్ సినిమాలోని పాత్రలకి డబ్బింగ్ చెప్పించారు.

అలా తెలుగులో 'సింబా' పాత్రకి హీరో నానీతో డబ్బింగ్ చెప్పించారు. తాను డబ్బింగ్ చెప్పిన వీడియోతో లింక్ చేయబడిన టీజర్ ను నాని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. "మా నాన్న ఒకసారి చెప్పారు .. సూర్య కిరణాలు పడే చోటంతా రక్షించాలని" అంటూ నాని డబ్బింగ్ చెప్పిన ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలోని మిగతా పాత్రలకి జగపతిబాబు .. బ్రహ్మానందం .. అలీ .. రవిశంకర్ వాయిస్ ఇచ్చారు. ఈ సినిమా ఏ స్థాయిలో చిన్నారులను ఆకట్టుకుంటుందో చూడాలి.
Nani

More Telugu News