లోకేశ్ చాలా తెలివైనవాడు.. ఆలోచనాపరుడు.. కానీ ఆ ఒక్క విషయంలోనే తేడా కొట్టింది!: బీజేపీ నేత అంబికా కృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోకేశ్ చాలా తెలివైనవాడు.. ఆలోచనాపరుడు.. కానీ ఆ ఒక్క విషయంలోనే తేడా కొట్టింది!: బీజేపీ నేత అంబికా కృష్ణ

  • నారా లోకేశ్ కొన్ని పద్ధతులు మార్చుకోవాలి
  • మాకు చంద్రబాబు అపాయింట్ మెంట్ దొరికేది
  • కానీ లోకేశ్ అపాయింట్ మెంట్ దొరికేది కాదు
  • దీనిపై చాలామంది మంత్రులు ఫీలయ్యారు
టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కొన్ని పద్ధతులను మార్చుకోవాల్సి ఉందని బీజేపీ నేత అంబికా కృష్ణ తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేశ్ అపాయింట్ మెంట్ కూడా పార్టీ నేతలకు దొరికేది కాదని వ్యాఖ్యానించారు. ‘మాకు చంద్రబాబుతో కావాలన్నా అపాయింట్ మెంట్ దొరికేది. కానీ లోకేశ్ తో దొరికేది కాదు. ఆయన(లోకేశ్) ఓ మంత్రి మాత్రమే.

నాతో పాటుగా కొంతమంది మంత్రులు కూడా ఈ విషయంలో చాలా ఫీలయ్యారు. ఓ నాయకుడు అన్నవాడి వెనుక కొన్ని లక్షల మంది ఉంటారు. అది అర్థం చేసుకుని వాళ్లకు టైం ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంది కదా. మీరు సీఎం కొడుకు కాబట్టే మిగతా మంత్రుల దగ్గరకు పోకుండా మీ(లోకేశ్) దగ్గరకు వస్తాం. మరి మీరు అపాయింట్ మెంట్ ఇవ్వకపోతే ఎలా? లోకేశ్ చేసిన పెద్ద బ్లండర్ ఇదే’ అని అంబికా కృష్ణ చెప్పారు.

లోకేశ్ చాలా తెలివైనవాడనీ, ఆలోచనాపరుడనీ, స్టాన్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడని అంబికా కృష్ణ తెలిపారు. ‘ఓ విషయాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి? ఓ సమస్యను ఎలా పరిష్కరించాలి? అనే విషయం లోకేశ్ కు బాగా తెలుసు. అయితే ఆయన చుట్టూ ఉన్న గ్యాంగ్ సరైన డైరెక్షన్ ఇవ్వలేకపోతుందేమో? లోకేశ్ విషయంలో అన్ని విషయాలు సరిగ్గానే ఉన్నాయి కానీ, ప్రణాళికల అమలులో మాత్రం తేడా కొట్టింది’ అని విశ్లేషించారు.
Andhra Pradesh
Telugudesam
Chandrababu
Nara Lokesh
BJP
ambika krishna

More Telugu News