నగ్న సన్నివేశంలో ఎలా నటించానంటే..!: అమలాపాల్ వివరణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నగ్న సన్నివేశంలో ఎలా నటించానంటే..!: అమలాపాల్ వివరణ

  • ప్రత్యేక వస్త్రాన్ని ధరించడం గురించి రత్నకుమార్ నాతో చర్చించారు
  • కంగారుపడాల్సిన అవసరం లేదని నేను చెప్పా
  • క్రూ సభ్యులపై నమ్మకం లేకపోతే ఆ సన్నివేశాన్ని చేయలేకపోయేదాన్ని
తన తాజా చిత్రం 'ఆడై'లో అమలాపాల్ నగ్న సన్నివేశంలో నటించి అందరినీ షాక్ కు గురిచేసిన సంగతి తెలిసిందే. దీనిపై జాతీయ పత్రిక 'ది హిందూ'తో ఆమె మాట్లాడుతూ, న్యూడ్ సీన్ సందర్భంగా ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించడంపై దర్శకుడు రత్నకుమార్ తనతో చర్చించారని... అయితే, కంగారు పడాల్సిన పని లేదని తాను ఆయనకు చెప్పానని తెలిపింది. ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే రోజున తాను చాలా టెన్షన్ కు గురయ్యానని... సెట్స్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠకు గురయ్యానని... సెట్స్ లో ఎవరెవరు ఉంటారు? తనకు రక్షణ ఉంటుందా? అని కంగారు పడ్డానని చెప్పింది.

అయితే చాలా క్లోజ్డ్ సెట్ ను దర్శకుడు ఏర్పాటు చేశారని... కేవలం 15 మంది మాత్రమే సెట్స్ లో ఉన్నారని అమలాపాల్ తెలిపింది. క్రూ సభ్యులపై నమ్మకం లేకపోతే తాను ఆ సన్నివేశాన్ని చేయలేకపోయేదాన్నని చెప్పింది.
Amala Paul
Aadai
Nude Scene

More Telugu News