నాపై ఒక్క ఆరోపణను నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటా!:మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సవాల్
- నేను టీఆర్ఎస్ నుంచి రూ.100 కోట్లు తీసుకోలేదు
- టీడీపీ నేతలు నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు
- మంగళగిరిలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ నేత
ఈ సందర్భంగా తాను లంచాలు తీసుకున్నట్లు, అవినీతికి పాల్పడినట్లు టీడీపీ నేతలు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆర్కే సవాల్ విసిరారు. ‘చంద్రబాబు, లోకేశ్ లను నేను డైరెక్టుగా అడుగుతున్నా.. మీ ఇల్లు అక్రమమా? సక్రమమా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఓ బీసీ మహిళ(పంచుమర్తి అనురాధ)ను అడ్డు పెట్టుకుని ఆమెతో నాపై విమర్శలు చేయించడం పద్దతి కాదు. ధర్మం కాదు అని తెలియజేస్తున్నా’ అని చెప్పారు.