ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా విరాట్ కోహ్లీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా విరాట్ కోహ్లీ

  • బ్యాట్స్ మెన్ జాబితాలో తొలి రెండు స్థానాలు టీమిండియావే 
  • రెండో స్థానంలో నిలిచిన రోహిత్ శర్మ
  • బౌలర్ల ర్యాంకింగ్స్.. తొలి స్థానంలో కొనసాగుతున్న బుమ్రా
ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ గా విరాట్ కోహ్లీ అవతరించాడు. ఐసీసీ తాజా వన్డే ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. బ్యాట్స్ మెన్ జాబితాలో తొలి రెండు స్థానాల్లో టీమిండియా కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ లు నిలిచారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో ఆరో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ రెండో స్థానానికి చేరుకోవడం గమనార్హం. బౌలర్ల ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో టీమిండియా బౌలర్ జస్పీత్ బుమ్రా కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ట్రెంట్ బౌల్ట్, మూడో స్థానంలో కమ్మిన్స్, రషీద్ ఖాన్, కుల్దీప్ లు సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు.
ICC
Cricket
One-day Rankings
Virat Kohli

More Telugu News