అంతా అయిపోయిన తర్వాత నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంతా అయిపోయిన తర్వాత నిలకడగా ఆడుతున్న దక్షిణాఫ్రికా!

  • మాంచెస్టర్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా
  • 17 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 112 పరుగులు
  • డికాక్ హాఫ్ సెంచరీ
ఈ ప్రపంచకప్ లో దక్షిణాఫ్రికా జట్టుది ఓ విచిత్రమైన గాథ. కనీసం సెమీస్ కు చేరుతుందని భావిస్తే, లీగ్ దశలో ఒక్క మ్యాచ్ గెలిచేందుకు ఆపసోపాలు పడింది. 8 మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ ల్లో గెలిచి మరో 5 మ్యాచ్ ల్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది. దాంతో టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. చివరికి ఓ సాధారణ జట్టులా ఎలాంటి ప్రాధాన్యంలేని మ్యాచ్ లు ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. పసలేని సారథ్యం, పేలవమైన బ్యాటింగ్, ప్రభావంచూపని బౌలింగ్... ఇలా సఫారీలకు ఈ టోర్నీ ఓ చేదు జ్ఞాపకం అనడంలో ఎలాంటి సందేహంలేదు.

ఇవాళ తన చివరి లీగ్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టు ఆస్ట్రేలియాతో తలపడుతోంది. మాంచెస్టర్ లో జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలుచుకున్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. టోర్నీ మొదట్లో దారుణంగా విఫలమైన సఫారీ టాపార్డర్ ఈసారి బాధ్యతగా ఆడుతుండడం విశేషం అని చెప్పాలి. 17 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 1 వికెట్ నష్టానికి 112 పరుగులు చేసింది. ఓపెనర్ మర్ క్రమ్ 34 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ డికాక్ 52 పరుగులతో ఆడుతున్నాడు. డికాక్ కు జతగా కెప్టెన్ డుప్లెసిస్ 15 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
South Africa
Australia
World Cup

More Telugu News