అప్పుడు టీడీపీపై కేసులు పెట్టిన మీరు.. ఇప్పుడు జయేష్ రంజన్‌పై కేసు పెడుతున్నారా?: దాసోజు శ్రవణ్
- ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తామనడం సబబేనా?
- ప్రజల అనుమతి లేకుండా ఎలా క్రోడీకరించారు?
- ప్రజల నుంచి ఎలాంటి వివరాలు సేకరించారో చెప్పాలి
సమాచారాన్ని ప్రజల అనుమతి లేకుండా ఎలా క్రోడీకరించారు? పౌరుల అనుమతి తీసుకున్నారా? అంటూ మండిపడ్డారు. ప్రజల నుంచి ప్రభుత్వం ఎలాంటి వివరాలు సేకరించిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమాచారాన్ని టీడీపీ చోరీ చేసిందని కేసులు పెట్టిన విషయాన్ని శ్రవణ్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్‌పై కేసు పెడుతున్నారా? అని శ్రవణ్ నిలదీశారు.