హైదరాబాద్ లో అమిత్ షా.. గిరిజన కుటుంబానికి బీజేపీ తొలి సభ్యత్వం
- శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు స్వాగతం
- గిరిజన మహిళ సోనీ బాయికి బీజేపీ సభ్యత్వం
- కేఎల్ సీసీ ఫంక్షన్ హాల్ లో సభ్యత్వ నమోదు నిర్వహణ
అనంతరం, శంషాబాద్ లోని కేఎల్ సీసీ ఫంక్షన్ హాల్ లో అమిత్ షా ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేఎల్ సీసీ హాలుకు బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 7.15 గంటలకు నోవాటెల్ హోటల్ లో ముఖ్యనేతలతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం, రాత్రి 9 గంటలకు తిరిగి ఢిల్లీకి అమిత్ బయలుదేరి వెళ్లనున్నారు.