హైదరాబాద్ లో అమిత్ షా.. గిరిజన కుటుంబానికి బీజేపీ తొలి సభ్యత్వం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైదరాబాద్ లో అమిత్ షా.. గిరిజన కుటుంబానికి బీజేపీ తొలి సభ్యత్వం

  • శంషాబాద్ విమానాశ్రయంలో అమిత్ షాకు స్వాగతం
  • గిరిజన మహిళ సోనీ బాయికి బీజేపీ సభ్యత్వం
  • కేఎల్ సీసీ ఫంక్షన్ హాల్ లో సభ్యత్వ నమోదు నిర్వహణ
బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించే నిమిత్తం కేంద్ర హోం మంత్రి, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హైదరాబాద్ వచ్చారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు గవర్నర్ నరసింహన్, డీజీపీ మహేందర్ రెడ్డి, బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం, రంగారెడ్డి జిల్లా, పహాడీ షరీఫ్ పరిధిలోని రంగనాయక తండాకు ఆయన వెళ్లారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా తొలి సభ్యత్వాన్ని గిరిజన మహిళ సోనీ బాయి కుటుంబానికి ఇచ్చారు.

అనంతరం, శంషాబాద్ లోని కేఎల్ సీసీ ఫంక్షన్ హాల్ లో అమిత్ షా ఆధ్వర్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కేఎల్ సీసీ హాలుకు బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముగిసిన తర్వాత  రాత్రి 7.15 గంటలకు నోవాటెల్ హోటల్ లో ముఖ్యనేతలతో విందు సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం, రాత్రి 9 గంటలకు తిరిగి ఢిల్లీకి అమిత్ బయలుదేరి వెళ్లనున్నారు.
Hyderabad
BJP
Amit Shah
pahadi sharif

More Telugu News