బుమ్రాకు 100వ వికెట్.. లంక నాలుగు వికెట్లు డౌన్... అన్నింట్లో ధోనీ హ్యాండ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుమ్రాకు 100వ వికెట్.. లంక నాలుగు వికెట్లు డౌన్... అన్నింట్లో ధోనీ హ్యాండ్!

  • లంక ఓపెనర్ల వికెట్లు చేజిక్కించుకున్న బుమ్రా
  • హార్దిక్, జడేజాకు చెరో వికెట్
  • మూడు క్యాచ్ లు, ఓ స్టంపౌట్ చేసిన ధోనీ
వరల్డ్ కప్ లో టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ లో శ్రీలంకతో తలపడుతోంది. లీడ్స్ లోని హెడింగ్లే మైదానంలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకేయులను భారత బౌలర్లు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా, జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బంతులకు లంక ఓపెనర్ల వద్ద జవాబే లేకుండాపోయింది. బుమ్రా ధాటికి కెప్టెన్ దిముత్ కరుణరత్నే(10), కుశాల్ పెరెరా (18) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ కు మళ్లారు. కాగా, కరుణరత్నేను అవుట్ చేయడం ద్వారా బుమ్రా వన్డేల్లో 100వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. 57 మ్యాచ్ ల్లో బుమ్రా ఈ ఘనత అందుకున్నాడు.

ఇక, హార్దిక్ పాండ్య, జడేజా కూడా విజృంభించడంతో శ్రీలంక 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. విశేషం ఏంటంటే, ఈ నాలుగు వికెట్ల పతనంలో ధోనీ హస్తం ఉంది. కరుణరత్నే, పెరెరా, ఫెర్నాండోల క్యాచ్ లు అందుకున్న ధోనీ, మెండిస్ ను స్టంపౌట్ చేశాడు. ప్రస్తుతం శ్రీలంక 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో ఏంజెలా మాథ్యూస్, లహిరు తిరిమన్నే ఉన్నారు.
India
Sri Lanka
World Cup
Bumrah
MS Dhoni

More Telugu News