విజయనిర్మల సమయస్ఫూర్తి, చమత్కారం అద్భుతం: హీరో బాలకృష్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయనిర్మల సమయస్ఫూర్తి, చమత్కారం అద్భుతం: హీరో బాలకృష్ణ

  • విజయనిర్మల సంస్మరణ సభ
  • పాల్గొన్న సినీ ప్రముఖులు
  • ఆమెతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న బాలయ్య
ప్రముఖ నటి దివంగత విజయనిర్మల ఎంతో సమయస్ఫూర్తిని ప్రదర్శించేవారని, చమత్కారంగానూ మాట్లాడగలరని హీరో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఆమె సంస్మరణ సభ హైదరాబాద్, గచ్చిబౌలిలోని ఓ ఫంక్షన్ హాల్ లో జరుగగా, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని, విజయనిర్మలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, ఆమెతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. తాను, కృష్ణ, కృష్ణంరాజు కలిసి 'సుల్తాన్' సినిమా చేశామని చెబుతూ, అప్పట్లో షూటింగ్ కోసం అండమాన్ కు వెళ్లగా, విజయనిర్మల కూడా వచ్చి, తమకు స్వయంగా వంట చేసి పెట్టారని అన్నారు.

అక్కడి తెలుగు అసోసియేషన్ తమకు సన్మానం చేయగా, తాను మాట్లాడుతూ, వేదికపై ముగ్గురు కృష్ణులు ఉన్నారని చెప్పగానే, విజయనిర్మల తన చేతిలోని మైక్ ను అందుకుని, తాను పాండురంగ మహాత్మ్యం సినిమాలో కృష్ణుడిగా నటించానని, ఇక్కడ నలుగురు కృష్ణులు ఉన్నారని చమత్కరించారని చెప్పారు. నడిచే వ్యక్తి కృష్ణ అయితే, ఆయన్ను నడిపించింది మాత్రం విజయనిర్మలేనని కొనియాడారు. తాను ఆమెను ఎప్పుడు కలిసినా, పాజిటివ్ ఎనర్జీతో కనిపించేవారని అన్నారు. 
Balakrishna
Vijayanirmala
Krishna

More Telugu News