దుబాయ్ లో కష్టాల్లో తెలంగాణ యువతి... వెంటనే స్పందించిన కేటీఆర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దుబాయ్ లో కష్టాల్లో తెలంగాణ యువతి... వెంటనే స్పందించిన కేటీఆర్!

  • పొట్టకూటికోసం దుబాయ్ వెళ్లిన యువతి
  • యజమాని వైఖరితో అష్టకష్టాలు
  • వీడియో చూసి స్పందించిన కేటీఆర్
ఇంట్లో డబ్బు కష్టాలు. ఎలాగైనా ఆదుకోవాలన్న ఆలోచనతో ఓ వ్యక్తిని నమ్మి, దుబాయ్ వెళితే డబ్బులు సంపాదించుకోవచ్చని వెళ్లిన ఓ యువతి, అక్కడ తానున్న ఇంట్లో అష్టకష్టాలూ పడుతోంది. ఎలాగోలా ఓ సెల్ ఫోన్ సంపాదించి, తన కష్టాలను వీడియో తీసి బంధుమిత్రులకు పంపితే, అది టీఆర్ఎస్ నేత కేటీఆర్ కు చేరింది.

ఏదైనా సమస్య తన దృష్టికి వస్తే వెంటనే స్పందించే కేటీఆర్, దుబాయ్‌ లోని భారత రాయబారి నవదీప్‌ సూరిని ట్యాగ్ చేస్తూ విషయాన్ని తెలిపారు. ఉపాధి కోసం వెళ్లిన తాను, ఒక ఇంట్లో పనికి కుదిరి, ఆ ఇంటి యాజమాని కుటుంబం కారణంగా ఇక్కట్లు పడుతున్నానని ఆ యువతి చెప్పగా, వెంటనే స్పందించిన కేటీఆర్, దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం దృష్టికి తెచ్చారు. బాధిత మహిళ క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. వెంటనే స్పందించిన రాయబారి, ఆమె ఆచూకీ కోసం చర్యలు చేపడతామంటూ ట్విట్టర్‌ లో సమాధానమిచ్చారు.
KTR
Dubai
Lady
Telangana

More Telugu News