జగన్ గారూ.. ఇలాగైతే ఏపీలో పగిలిన సోలార్ ప్యానెళ్లు, మీ తుపాకులే మిగులుతాయ్! నారా లోకేశ్ హెచ్చరిక
- మీరు ఏపీ యువత భవిష్యత్ ను ధ్వంసం చేస్తున్నారు
- కర్నూలులో మీ నేతలు సోలార్ పార్కువారిని తుపాకులతో బెదిరించారు
- కడపలో ఏకంగా సోలార్ ప్యానెళ్లను ధ్వంసం చేశారు
‘మీ ఎమ్మెల్యేలు పగులకొడుతోంది సోలార్ ప్యానల్స్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత భవిష్యత్తును. మీ వాళ్ల దౌర్జన్యకాండ ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ఉన్న కంపెనీలు పోయి మీ సైన్యం పగలగొట్టిన సోలార్ ప్యానల్స్, మీ నాయకులు వాడుతున్న తుపాకులు మాత్రమే మిగులుతాయి’ అని లోకేశ్ హెచ్చరించారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన లోకేశ్.. కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలను తన ట్వీట్లకు జతచేశారు.