పార్లమెంటుకు బస్తాల్లో చేరుకున్న బడ్జెట్ కాపీలు

  • ఆకుపచ్చ రంగు బస్తాల్లో పార్లమెంటుకు చేరుకున్న బడ్జెట్ ప్రతులు
  • మరికాసేపట్లో బడ్జెట్ ప్రసంగం ప్రారంభం
  • ఆసక్తిగా ఎదురుచూస్తున్న దేశం
మరికొన్ని నిమిషాల్లో పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగం మొదలు కాబోతోంది. తొలిసారి ఓ మహిళా ఆర్థిక మంత్రి ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. బడ్జెట్‌లో కూడికలు, తీసివేతలపై దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో సభ్యులకు పంచేందుకు ముద్రించిన బడ్జెట్ కాపీలు పార్లమెంటుకు బస్తాల్లో చేరుకున్నాయి. ఆకుపచ్చ రంగు బస్తాల్లో కుట్టిన బడ్జెట్ ప్రతులను వ్యానులో పార్లమెంటు ప్రాంగణానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి వాటిని కూలీలు భవనంలోకి తీసుకెళ్లారు.
Go Back to Shorts
Union Budget 2019-20
Nirmala sitaram
BJP
budget copies
Lok Sabha

More Telugu News